BSc Nursing Notification: ఆర్టీసీ దవఖానాలో బీఎస్సీ నర్సింగ్.. అడ్మిషన్లు షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSc Nursing Notification: హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో గల నర్సింగ్ కాలేజీలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయింది. ఈ విద్యా సంవత్సరంలో B.Sc. నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. తార్నాక TSRTC నర్సింగ్ కాలేజీలో 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్ మెంట్ కోటాలో BSc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. నర్సింగ్ కళాశాలలో బాలికలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు.
Read Also: Karnataka Cabinet: కర్ణాటకలో కొత్తగా 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరడానికి ఇంటర్ బైపీసీ ఉతీర్ణులై.. 17 ఏళ్లు నిండిన విద్యార్థినులు అర్హులని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్ కాలేజీని 2022 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇందుకు రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనుమతి ఉంది. కన్వీనర్ కోటాలో 30 సీట్లు, యాజమాన్య కోటాలో 20 సీట్లు చొప్పున మొత్తం 50 సీట్లు ఉంటాయి. ఆర్టీసీ సిబ్బందికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు తార్నాక దవాఖానకు ఆధునీకరణ పనులు చేపట్టారు.నర్సింగ్ కళాశాల ప్రవేశ వివరాలు, ఇతర సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-68153333, 040-30102829 లేదా https://www.tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. నర్సింగ్ కాలేజీ ముఖ్య వైద్యాధికారి, సూపరింటెండెంట్‌ను నేరుగా సంప్రదించవచ్చని వెల్లడించారు.
తార్నాక #TSRTC నర్సింగ్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్ మెంట్ కోటాలో https://t.co/LjX6Unyovl నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. నాలుగేళ్ళ కోర్సులో చేరడానికి ఇంటర్ బైపీసీ ఉతీర్ణులైన 17 ఏళ్లు నిండిన విద్యార్థినులు అర్హులు. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు… pic.twitter.com/pODODr1jyc
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 26, 2023
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!