West Bengal: టీఎంసీ నాయకుడు దారుణ హత్య.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. జాయ్‌నగర్‌లోని తన ఇంటి వద్దే సైఫుద్దీన్ లస్కర్ ను కాల్చి చంపారు. దీంతో టీఎంసీ నాయకులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశారు. అంతేకాకుండా.. కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. అధికార తృణమూల్, ప్రతిపక్ష సీపీఎం మధ్య రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. లస్కర్ జాయ్‌నగర్‌లోని బముంగాచి ప్రాంతంలో తృణమూల్ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
అయితే లస్కర్ మద్దతుదారులు అతని హత్యలో ప్రమేయం ఉందని అనుమానించిన ఓ వ్యక్తిని పట్టుకుని, అతనిపై తీవ్రంగా దాడి చేశారు. అంతేకాకుండా.. అధికార పార్టీ మద్దతుదారులు ఆ ప్రాంతంలోని పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. సైఫుద్దీన్ లస్కర్ హత్య వెనుక సీపీఎం మద్దతుదారుల హస్తం ఉందని స్థానిక తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
మరోవైపు సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి ఆ ఆరోపణలను ఖండించారు. ఈ హత్య తృణమూల్ అంతర్గత కలహాల ఫలితమే అని అన్నారు. సీపీఎంను నిందించి ప్రయోజనం లేదన్నారు. పోలీసులు సరైన విచారణ జరిపి కుట్రను ఛేదించాలని చక్రవర్తి తెలిపారు. ఇదిలా ఉంటే.. తృణమూల్ నేత హత్యకేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..