Crime News: రోజురోజుకు హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడో చోట దారుణ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మొన్నటికి మొన్న ముంబైలో తన సహచరిని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రెషర్ కుక్కర్ లో ఉడికించాడు. ఇలాంటి క్రూరమైన ఘటనలకు పాల్పడున్నారు దుర్మార్గులు. ఇప్పుడు తాజాగా వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Read Also: Prabhudeva: 50 ఏళ్ళ వయస్సులో మూడోసారి తండ్రి అయిన ఇండియన్ మైకేల్ జాక్సన్..?
పరిగి మండలం కాలాపూర్ లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. మృతురాలిని జుట్టు శిరీష(19)గా గుర్తించారు. శిరీష రెండ్రోజులుగా కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు తెలిపారు. హత్య చేసిన అనంతరం దుండగులు మృతదేహాన్ని నీటి కుంటలో పడేశారు. నీటి కుంటలో మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అంతేకాకుండా శిరీషను చంపి కళ్లను స్క్రూ డ్రైవర్ తో ఛిద్రం చేశారు దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు శిరీష ఇంటర్ పూర్తిచేసుకుని పారామెడికల్ కళాశాలలో నూతనంగా చేరినట్లుగా బంధువులు చెబుతున్నారు.
Read Also: West Bengal: రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తి.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
బాలిక హత్య ఘటనపై తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. రెండు రోజులు అయిందని ఇంటి నుంచి వెళ్లి.. క్షేమంగా తిరిగివస్తుందనుకున్నాం కానీ.. ఇలా దారుణ హత్యకు పాల్పడుతుందని అనుకోలేదంటూ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇంత కిరాతకంగా హత్య చేసిన వారిని వదిలిపెట్టొదంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.