Site icon NTV Telugu

Brutal Incidnet : చిన్నారిపై అంగన్‌వాడీ ఆయా కర్కశత్వం… కత్తిని వేడి చేసి వాతలు పెట్టిన వైనం

Anganwadi

Anganwadi

Brutal Incidnet : పిల్లలు అంటేనే అల్లరి చేయడం వారి నైజం.. ఇంట్లో అయినా.. బడిలో అయినా చిన్న పిల్లలు అల్లరి చేస్తుంటే పెద్దవారు వారించడం కూడా కామనే.. అయితే.. వారించడం పక్కన పెట్టి ఏకంగా ఓ అంగన్‌వాడీ ఆయా చిన్నారిపై కర్కశత్వంపై ప్రవర్తించిన తీరు అందరినీ అశ్చర్యానికి గురిచేయడమే కాకుండా.. ఒక్కింత కోపాన్ని కూడా తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారి అల్లరి చేస్తున్నాడని కత్తిని వేడి చేసి వాతలు పెట్టింది అంగన్వాడీ ఆయా.

Hero Passion Plus: ఫ్యాషన్ ప్లాస్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. 2025 మోడల్‌ విడుదల.. ధర ఎంతంటే?

మహబూబాబాద్ లోని సిగ్నల్ కాలనీలోని అంగన్ వాడి కేంద్రంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్న పొన్నబోయిన మణిదీప్ (5 ) అనే బాలుడుకి వాతలు పెట్టింది అంగన్‌వాడీ ఆయా. నాలుగు రోజుల క్రితం అల్లరి చేస్తున్నాడని బాలుడిపై అంగన్‌వాడీ ఆయా బట్టు భద్రమ్మ కత్తిని స్టవ్ పై కాల్చి బాలుడి కాలుపై వాతలు పెట్టింది. అయితే.. అంగన్‌వాడీ నుంచి ఇంటికి వెళ్ళిన బాలుడు విషయం తల్లితండ్రులకు చెప్పడంతో… తల్లితండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ విషయాన్ని ఎవ్వరు పట్టించుకోక పోవడంతో అంగన్‌వాడీ ఎదుట బాధిత బాలుడు తల్లిదండ్రులు నిరసనకు దిగారు. బంధుమిత్రులతో కలసి ఆయాపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు.

KGF Star Yash: కేజీఎఫ్ రాకీ భాయ్ వాడే లగ్జరీ కారు ఎన్ని కోట్లో తెలుసా?

Exit mobile version