ADR Report : దేశంలోనే బీఆర్ఎస్ టాప్.. రెండో స్థానంలో ఆప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంలో ప్రాంతీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి 2021-2022 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన భారతరాష్ట్ర సమితి పార్టీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి మొత్తం రూ. 40. 9 కోట్లు విరాళాల రూపంలో అందాయి. ఆ తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 38.2 కోట్లు విరాళాల రూపంలో అందాయి.
Also Read : Gopichand: ఆయన గొప్పోడు.. నువ్వేం పీకావ్.. హీరోకు డైరెక్టర్ సూటి ప్రశ్న
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
అసోసియేషన్ ఫర్ డెముక్రటిక్ రీఫార్మ్స్ ( ఏడీఆర్ ) ఈ గణాంకాలను వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్, ఆప్ తర్వాత జేడీఎస్ కు అత్యధిక విరాళాలు అందాయి. ఆ పార్టీకి రూ. 33.2 కోట్లు డోనేషన్ల రూపంలో వచ్చాయి. అలాగే సమాజ్ వాదీ పార్టీకి రూ. 29.7 కోట్లు, వైఎస్సార్పీపీకి రూ. 20 కోట్ల విరాళాలు అందినట్లు ఏడీఆర్ నివేదికలో వెల్లడించింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించింది.
Also Read : Amit Shah : కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వస్తే అల్లర్లే
దేశంలోని మొత్తం 26 ప్రాంతీయ పార్టీలకు రూ. 189.8 కోట్లు అందినట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటిలో రూ. 162.21 కోట్ల విరాళాలు ఐదు పార్టీలే అందుకున్నట్లు తెలిపింది. అయితే ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్డీపీపీ, ఎస్డీఎఫ్, ఏఐఎఫ్బీ, పీఎంకే, జేకేఎన్సీ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించలేదు. కాగా.. ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం ఈ నెలలోనే జాతీయ పార్టీగా గుర్తింపును ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక విరాళాలు వచ్చాయని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!