BRS Supports Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు.. కేటీఆర్ కీలక పోస్ట్..

Brs Supports Delimitation Bill Ktr

Brs Supports Delimitation Bill Ktr

BRS Supports Delimitation Bill: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుకు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు (Revised Delimitation Bill) మద్దతు ఇవ్వాలని భారత్ రాష్ట్ర సమితి (BRS) నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ తన వైఖరిని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

“డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి మొదటి నుంచీ చాలా స్పష్టంగా ఉంది. పార్లమెంట్‌లో దక్షిణ భారతదేశ (South India) ప్రాతినిధ్యంలో ఎలాంటి కోత ఉండకూడదని, తెలంగాణకు (Telangana) ఏమాత్రం అన్యాయం జరిగినా సహించేది లేదని మేము మొదటి నుంచీ పోరాడుతున్నాం. పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రస్తుత 24 శాతం వాటాను కచ్చితంగా కాపాడాలని తాము నిరంతరం డిమాండ్ చేస్తూ వచ్చాం. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదనలో రాష్ట్రాల మధ్య ఉన్న ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు మార్చకుండా రక్షణ కల్పించడం తమ ప్రధాన ఆందోళనను పరిష్కరించింది. అంతేకాకుండా, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను (Lok Sabha Seats) 50 శాతం పెంచడం వల్ల తెలంగాణలో ఎంపీ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు పెరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పార్లమెంట్‌లో ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మా ముగ్గురు రాజ్యసభ ఎంపీలు (Rajya Sabha MPs) ఓటు వేస్తారు. అలాగే, మహిళా రిజర్వేషన్లకు (Women’s Reservation) తాము ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నాం. దాని అమలుకు పూర్తి కట్టుబడి ఉన్నాం” అని మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.