Site icon NTV Telugu

BRS Protest : నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ ఆందోళనలు

Brs

Brs

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు భారత రాష్ట్ర సమితి సన్నద్ధమవుతోంది. ఉచిత విద్యుత్‌ అవసరం లేదన్న కాంగ్రెస్ ప్రకటనపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనను నిరసిస్తూ గ్రామాల్లో కాంగ్రెస్‌ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్‌. అయితే.. ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న కాంగ్రెస్‌ ఆలోచన దుర్మార్గమని మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌. కాంగ్రెస్ మళ్లీ రైతు వ్యతిరేక విధానాలు బయటపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు కాంగ్రెస్‌ విధానాలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Also Read : Flood fear in Delhi: యమున ఉగ్రరూపం.. ఢిల్లీకి వరద ముప్పు

టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడ ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్ చాలన్నారు. 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మండిపడుతోంది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

Also Read : Kedarnath Yatra: భారీ వర్షాలు.. నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర

Exit mobile version