NTV Telugu Site icon

BRS: మెడలో మిర్చి దండలు వేసుకొని.. కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

Kavitha

Kavitha

కౌన్సిల్ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన తెలిపారు. మెడలో మిర్చి దండలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని రూ. 25వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైంది. ధర లేక ఈ సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:Ponnam Prabhakar: గతంలో పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత చెక్కులు తీసుకునే పరిస్థితి..

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధరకు కొనాలని కోరారు. క్వింటాల్ కు రూ. 25 వేల రూపాయలు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటలు విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ చేశారు.