Shock to BRS: తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పార్టీని వీడుతూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు తిరుపతి నుంచి నేరుగా సీఎం రేవంత్ నివాసానికి ప్రకాశ్ గౌడ్ రానున్నారు. సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్, పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రకాశ్ గౌడ్‌తో పాటు మరో ఇద్దరు మున్సిపల్ ఛైర్మన్లు కూడా హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ప్రకాశ్ గౌడ్ చేరితే కాంగ్రెస్‌లోకి వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరుతుంది.
Read Also: 19 IAS Officers Transfer: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ..