Site icon NTV Telugu

Telangana Elections 2023: ఏది కావాలి మనకు?.. ఆలోచించు తెలంగాణ రైతన్నా: కేటీఆర్‌

Ktr

Ktr

KTR Tweet Goes Viral on Telangana Farmers Ahead of TS Elections 2023: దసరా పండగ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అని పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇందుకోసం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్‌ నేడు ఓ ట్వీట్‌ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ అమలు చేస్తున్న రైతు సంక్షేమాలను పోల్చి.. ఏది కావాలో ఎంచుకోవాలన్నారు.

Also Read: Jammu Kashmir: అర్నియా సెక్టార్‌లో కాల్పులు.. ఒక జవాన్, నలుగురు పౌరులకు గాయాలు

‘సీఎం కేసీఆర్‌ గారు కడుపునిండా ఇస్తున్న 24 గంటల కరెంటు కావాలా? లేదా కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాలా? లేకపోతె తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పిన 3 గంటల కరెంటు కావాలా?.. ఆలోచించు తెలంగాణ రైతన్నా. ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్లు కావాలా?.. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్సఫార్మర్లు మళ్లీ ఆ రోజులు రావాల్నా?.. లేదా రైతుబంధు, రైతుబీమా తెచ్చిన కేసీఆర్‌ కావాలా?.. చెరువులు బాగుచేసి, ప్రాజెక్టులు కట్టి, నెర్రెలు బారిన నేలను సస్యశామలం చేసిన కేసీఆర్‌ కావాలా?.. ఏది కావాలి మనకు? ఆలోచించు రైతన్నా?’ అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

Exit mobile version