NTV Telugu Site icon

BRS Legal Team: కాంగ్రెస్ పార్టీపై సీఈఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ లీగల్ టీం ఫిర్యాదు

Brs

Brs

తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను బీఆర్ఎస్ లీగల్ టీమ్ కలిసింది. రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీని కించపరిచే విధంగా కాంగ్రెస్ యాడ్స్ ను ఆపాలని సీఈవోకు కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు సోమా భరత్ మాట్లాడుతూ.. పచ్చగా ఉన్న తెలంగాణను హింసాత్మకంగా చేసేందుకు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది అని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. క్యాడర్ ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని సోమా భరత్ అన్నారు.

Read Also: Childrens died: బీహార్‌లో తీవ్ర విషాదం.. చెరువులో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి

వారం రోజుల్లో దుబ్బాక, అచ్చంపేట ఘటనలు జరిగాయని బీఆర్ఎస్ లీగల్ టీం తెలిపింది. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ సీరియస్ గానే ఉన్నారు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు జరిగితే రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు.. పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఎక్కడైనా ఘటనలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు ఎవరి వల్ల జరుగుతున్నాయో ప్రజలు ఆలోచన చేయాలి.. రేవంత్ కు టీడీపీ తల్లిపార్టీ అయితే.. కాంగ్రెస్ అత్తపార్టీ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి అంతర్గత ఒప్పందం కుదిరింది.. స్టార్ క్యాంపెనియర్ గా ఉన్న రేవంత్ రెడ్డి భాష పద్ధతిగా ఉండాలి.. ఎంసీసీ కమిటీకి చూపించిన ప్రకటనలు ఒకటి.. బయట ప్రచారం మరొకటి చేస్తున్నారు.. ఎదైనా కన్ఫ్యూజన్ ఉన్న అంశాలపై ఈసీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని బీఆర్ఎస్ లీగల్ టీమ్ తెలిపింది.

Show comments