NTV Telugu Site icon

Minister KTR : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సంబరాలు

Brs

Brs

తెలంగాణ రైతు రుణ మాఫీ పథకం అమలు నేటి నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అయితే.. దక్షిణాది రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని, మెట్రో విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడం తమ గెలుపు మనస్తత్వానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. అయితే.. సీఎం కేసీఆర్‌ రైతు రుణమాఫీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికే గత తొమ్మిది సంవత్సరాలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని కేటీఆర్ అన్నారు.

Also Read : Health Tips : ఈ ఆహారాలను ఎప్పుడూ ప్రెజర్ కుక్కర్ లో వండకూడదు తెలుసా?

రైతన్నలకు హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించడం అత్యంత సంతోషకరమైన విషయం అన్నారు. అనేక సందర్భాల్లో రైతుల వెంట నిలిచిన పార్టీ శ్రేణులు తాజాగా రైతన్నలకు రుణమాఫీ అంశంలోనూ వారితో కలిసి సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే.. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిశేకాలు చేస్తున్నారు. వరి చేళల్లో కేసీఆర్‌ (KCR) అక్షరాలు రాస్తూ ముఖ్యమంత్రికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలోని దూది వెంకటాపురంలో నారుతో కేసీఆర్‌ అక్షరాలు పేర్చి రైతులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.

Also Read : Jupally Krishna Rao : నేడు కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి కృష్ణారావు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. రైతు రుణమాఫీ ప్రకటించినందుకుగాను బోధ్‌ మండలం సోనాలలో రైతులు తమ పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని జేపీ తండా, గట్ల మాల్యాల, సిద్దన్నపేట గ్రామాల ప్రజలు, రైతులు.. రుణమాఫీ చేసి మరోసారి రైతు బాంధవుడు అని నిదర్శనం అని చూపిన కేసీఆర్, మంత్రి హరీశ్‌ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతు హితం కోసం ఎన్నికష్టాలు వచ్చినా.. ఇచ్చిన మాట ప్రకారం రూ.19 వేలకోట్ల పంట రుణాలు మాఫీ చేశారని ఆనందం వ్యక్తంచేశారు.