NTV Telugu Site icon

Lakshma Reddy Election campaign: భారీ మెజార్టీతో గెలిపిస్తాం.. లక్ష్మారెడ్డికి మాట ఇచ్చిన నేతలు, యువకులు

Lakshma Reddy

Lakshma Reddy

Lakshma Reddy Election campaign: తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోయింది.. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందే.. అధికారి బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.. తాజాగా కొందరు బీఫామ్‌లు కూడా అందజేసిన సీఎం కేసీఆర్‌.. మిగతావారికి బీఫామ్‌లు అందజేస్తున్నారు.. మరోవైపు.. బీఆర్ఎస్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి.. బీఆర్ఎస్‌ సర్కార్‌ సంక్షేమ పథకాలు, తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. మరోసారి తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ఇక, ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి దూసుకెళ్తారు.. తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. మరోసారి బీఆర్ఎస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు.. ఈ రోజు కేసీఆర్ గెలుపే లక్ష్యంగా జడ్చర్లలో ప్రచారం నిర్వహించారు లక్ష్మారెడ్డి.. జడ్చర్ల గౌడ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో భారీ మెజార్టీతో లక్ష్మారెడ్డిని గెలిపిస్తామంటూ వార్డు సభ్యులు, వార్డు కౌన్సిలర్లు, వార్డు యువ నాయకులు మాట ఇచ్చారు.. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌ లో చేరారు.

Read Also: Australia vs Sri Lanka: టాస్ గెలిచిన శ్రీలంక.. ఈసారైనా ఆస్ట్రేలియా 200 స్కోర్ చేస్తుందా?

 

 

 

 

 

Show comments