Site icon NTV Telugu

Chirumarthi Lingaiah: కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంపై చిరుమర్తి తీవ్ర ఆరోపణలు

Chirumarthi Lingaiah

Chirumarthi Lingaiah

Chirumarthi Lingaiah: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటాల తూటాలు అధికమవుతున్నాయి. తాగా నకిరేకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశంపై బీఆర్‌ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. అటవీ సంపద దోచుకొని, వ్యాపారులను బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, కిరాయి మర్డర్లు చేసి సంపాదించిన డబ్బు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంపై తీవ్ర ఆరోపణలు చేశారు నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన డబ్బు నియోజకవర్గంలో పంచుతూ వేముల వీరేశం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని.. పేదల పొట్ట కొట్టి సంపాదించిన డబ్బు తిరిగి పేదల వద్దకు వెళుతుందని చిరుమర్తి అన్నారు.

Also Read: Marsukola Saraswathi: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో టికెట్ చిచ్చు.. అమ్ముకున్నారని సరస్వతి తీవ్ర ఆరోపణలు

అధికారం ఉందని తనపై గతంలో దాడులు చేయించిన వ్యక్తి వేముల వీరేశం కాదా అంటూ ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంపై బిఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేసిన కామెంట్స్ ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతున్నాయి.

Exit mobile version