Brown Bread: కొంతమంది తమ బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా బ్రెడ్ టోస్ట్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే బ్రెడ్ లో ఎక్కువగా మైదా ఉంటుంది. బ్రెడ్ లో ఉండే పిండి పదార్థం కారణంగా తిన్న వెంటనే అది రక్తంలో కలిసిపోతుంది. ఇది షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. బ్రెడ్ ఎక్కువగా తింటే లావు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక బ్రౌన్ బ్రెడ్‌తో పోలిస్తే వైట్ బ్రెడ్ తినడం అంత మంచిది కాదు. దీనిలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు పెద్దగా ఏమీ ఉండవు.అయితే ఇది తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఆరోగ్యానికి హాని చేసే మైదాను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో ఫైబర్ ఉండరు. దాని కారణంగా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం, అజీర్తికి కారణమవుతుంది.
Also Read: Man Struck In Shop: మసాజ్ చైర్ లో పడుకున్న వ్యక్తికి వింత అనుభవం.. ఏం జరిగిందంటే
అయితే వైట్ బ్రెడ్ ప్లేస్ లో బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే మంచిది. రోజూ ఒకటి లేదా రెండు బ్రౌన్‌బ్రెడ్ ముక్కలను తీసుకోవడం వల్ల సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్రౌన్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ తీసుకుంటే మంచిది. ఇందులో ఐరన్, జింక్, కాపర్, మెగ్నిషియం వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగవపడుతుంది. ఇక ఈ బ్రౌన్ బ్రెడ్ బరువు తగ్గాలనుకునే వారికి సూపర్ ఆప్షన్. ఇది తింటే కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ కలిగి త్వరగా ఆకలి అనిపించదు. దీనిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం జీర్ణ క్రియకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇక మల్టీ గ్రేయిన్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తక్కువగా ఉండేలా చేస్తాయి. దీని కారణంగా మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి రిస్క్ తగ్గుతుంది. అంతేకాకుండా మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఫ్యుతోన్యూట్రియన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించటానికి సహాయపడతాయి. దీని కారణంగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని వీటిని అతిగా తీసుకుంటే సమస్యలు వస్తాయి. కేవలం రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు మాత్రమే తినాలి.