Site icon NTV Telugu

Gandikota Murder Case: గండికోట మైనర్ బాలిక హత్య కేసులో సంచలనం.. బాలిక సోదరులే..

Kadapa

Kadapa

కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి వారం రోజులు అవుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి కేసును కొలిక్కి తెచ్చారు. బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. బాలిక సోదరులే హంతుకులని నిర్ధారించారు పోలీసులు. ప్రేమ వ్యవహారం.. కుటుంబ పరవువుతీస్తోందనే బాలికను ఆమె అన్నలు హతమార్చినట్లు తెలిపారు. బాలిక, బాలిక లవర్ లోకేష్ వేర్వేరు కులాలు కావడం.. ఆస్థిపాస్తుల్లోనూ తమతో సరితూగరనే భావనలో బాలిక బంధువులు ఉండడం.. ఇవే హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.

Also Read:Dhaka Plane Crash: వణికించిన మరో ప్రమాదం. స్కూల్ భవనంపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్..

సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు.. ఇన్‌స్టాగ్రాం చాటింగ్ లోనూ హత్య వ్యవహారాన్ని గుర్తించారు. మరిన్ని సాంకేతిక ఆధారాలకోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. వారం రోజుల కిందట గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి శవంగా కనిపించిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముందు ప్రియుడిని అనుమానించి విచారించారు. తర్వాత ప్రియుడి పాత్ర లేదని గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా అసలు నిందితులు దొరికిపోయారు.

Exit mobile version