Site icon NTV Telugu

Tragedy: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అనంతలోకాలకు.. అన్న ఇద్దరు చెల్లెల్లు మృతి

Road Accidnt

Road Accidnt

యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అన్న.. ఇద్దరు చెల్లెల్లు మృతి చెందారు. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదం.. గ్రేటర్‌ నోయిడాలోని ప్యారీ చౌక్‌ సమీపంలో జరిగింది. నలుగురు కలిసి బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. వీరంతా.. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మధురలోని జైత్ గ్రామానికి చెందిన శివ్ సింగ్ తన కుటుంబంతో కలిసి కులేసరలోని మధుబన్ విహార్ కాలనీలో నివసిస్తున్నారు. గురువారం.. తన కుమారుడు సురేంద్ర సింగ్, కూతుర్లు శైలీ, అన్షు, తన స్నేహితురాలు సిమ్మితో కలిసి బైక్‌పై కస్నాకు వెళ్లినట్లు శివ్ సింగ్ చెప్పాడు. కస్నాలో వివాహ వేడుకకు వెళ్లినట్లు తెలిపాడు. అనంతరం నలుగురు బైక్‌పై రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పాడు.

Lore and George: వరల్డ్ ఓల్డెస్ట్ అవిభక్త కవలలు ఇకలేరు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 2.30 గంటల సమయంలో ప్యారీ చౌక్‌ సమీపంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారని… వారందరినీ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే.. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన బాలిక సిమ్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కాలు మొత్తం నుజ్జునుజ్జైంది. కాగా.. ఈ ఘటనలో గుర్తు తెలియని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సెక్టార్ బీటా-2 కొత్వాలి పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. డిసెంబర్‌లో కొడుకు సురేంద్ర సింగ్ పెళ్లి జరగాల్సి ఉంది. అందుకు సంబంధించి ఇంట్లో పెళ్లి సన్నాహాలు మొదలయ్యాయి. అయితే కుటుంబమంతా సంతోషంగా ఉండాల్సిన సమయంలో విషాదంగా మారింది. మరోవైపు.. ఒక్కసారిగా మూడు మృతదేహాలను చూసిన తల్లిద్రండుల రోదనలు మిన్నంటాయి.

Exit mobile version