IND vs ENG: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ అద్భుతమైన శతకాలతో భారత బౌలింగ్‌ను నిలువరించారు. మ్యాచ్ మూడవ రోజు టీ విరామానికి ఇంగ్లాండ్ 75 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. దీనితో భారత్ కంటే ఇంగ్లాండ్ 232 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులతో కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడగా, యశస్వి జైస్వాల్ (87), జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. భారత్ మొత్తం 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆ తర్వాత ఇంగ్లాండ్ ఓపెనర్లు డకెట్ (0), పోప్ (0), క్రాలీ (19) త్వరగా పెవిలియన్‌కు చేరారు. జో రూట్ కూడా ఎక్కువసేపు నిలవలేక 22 పరుగులకు ఔటయ్యాడు. కెప్టెన్ స్టోక్స్ కూడా 0 పరుగులకు వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (140 నాటౌట్), వికెట్ కీపర్ జేమీ స్మిత్ (157 నాటౌట్) కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్‌కు ఇప్పటికే 271 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్రూక్ 209 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ తో రాణించగా, జేమీ స్మిత్ 169 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు చూపించాడు.
Read Also:Rajnath Singh: 2026 ఆగస్టులోపే నక్సల్స్ను తుడిచిపెట్టేస్తాం..
భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసినప్పటికీ మిగతా బౌలర్లు నిరాశపరిచారు. అకాష్ దీప్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్రసిద్ధ్, వాషింగ్టన్, జడేజా ఎవరికీ వికెట్లు దక్కలేదు. ముఖ్యంగా స్పిన్నర్ల నుంచి భారత్‌కు ఎలాంటి మద్దతూ లభించలేదు. ఇంగ్లాండ్ ప్రస్తుతం 355/5తో నిలిచింది. భారత్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే త్వరగా ఈ భాగస్వామ్యాన్ని విడతియ్యాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇంగ్లాండ్ మళ్లీ మ్యాచ్‌పై పట్టును సాధించే అవకాశం ఉంది.
