మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో మూవీ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. అక్టోబర్ 15న జీ తెలుగు ఛానెల్ లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ సినిమా టెలికాస్ట్ కానుంది.బ్రో మూవీ శాటిలైట్ హక్కులను భారీ పోటీ మధ్య దాదాపు 20 కోట్ల రూపాయలకు కు జీ తెలుగు దక్కించుకున్నట్లు సమాచారం.ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ మనిషిని నడిపించే టైం గా కనిపిస్తాడు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరో కూడా ఈ సినిమా లో కీలక పాత్ర పోషించాడు.భారీ అంచనాల మధ్య జూలై 28న థియేటర్ల లో విడుదల అయినా ఈ మూవీ 80 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. బ్రో మూవీకి విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించాడు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే మరియు మాటలు అందించారు.తమిళం లో విజయవంతమైన వినోదయ సిత్తమ్ సినిమాకు రీమేక్ గా బ్రో మూవీ తెరకెక్కింది. కేతికా శర్మ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే మరో నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలు పాత్ర పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ బ్రో మూవీని నిర్మించారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే మార్క్ (సాయిధరమ్‌తేజ్) ఇంటి బాధ్యతల్ని మోస్తూ ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ఎంతో కష్టపడుతుంటాడు. అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదంలో అతడు మరణిస్తాడు.మార్క్‌కు 90 రోజులు తిరిగి బతికే ఛాన్స్ ఇస్తాడు టైమ్(పవన్ కళ్యాణ్). ఈ తొంభై రోజుల్లో అస్సలు ఏం జరిగింది.అనేది ఈ సినిమా కథ..