Cocktails Challenge: జమైకాలోని ఒక హోటల్ బార్ మెనూలో ఉన్న మొత్తం 21 కాక్‌టెయిల్స్‌ని తాగడానికి ఒక ఛాలెంజ్‌ని పూర్తి చేయడానికి ప్రయత్నించిన బ్రిటిష్ వ్యక్తి మరణించాడు. జమైకాలో తన కుటుంబంతో సెలవులో ఉన్న బ్రిటీష్ వ్యక్తి బార్ మెనూలో ఉన్న మొత్తం 21 కాక్‌టెయిల్స్ తాగడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మే 2022లో తిమోతీ సదరన్(53) తన పిల్లలు, సోదరి, ఇతర కుటుంబ సభ్యులతో సెలవులో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
Also Read: Rajasthan Kota : రెండు రోజుల్లో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య.. మరొకరిని కాపాడిన పోలీసులు
మెట్రో నివేదిక ప్రకారం, అతను సెయింట్ ఆన్స్‌లోని రాయల్ డెకామెరాన్ క్లబ్ కరేబియన్‌లో 12 కాక్‌టెయిల్స్ తాగిన తర్వాత తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్‌తో మరణించాడు. 12 కాక్టెయిల్స్ పూర్తి చేసిన తర్వాత, అతను తన హోటల్ గదికి తిరిగి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. అతడి కుటుంబసభ్యులు అతడిని కాపాడుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంబులెన్స్‌కి కాల్ చేయడానికి చాలా సమయం పట్టిందని, వచ్చిన ఒక నర్సు అతనికి సీపీఆర్ ఇవ్వలేదని, హోటల్ నెమ్మదిగా స్పందించిందని సదరన్ కుటుంబం ఆరోపించింది.
మృతుడి బంధువుల్లో ఒకరు మాట్లాడుతూ.. వచ్చిన నర్సు అతడి ఛాతిని మాత్రమే నొక్కిందని.. చికిత్స సరిగా చేసి ఉంటే అతడు ప్రాణాలతో ఉండేవాడని అన్నారు. బహుశా ఆమె ఏమి చేస్తుందో ఆమెకు తెలిస్తే అతను ఉండేవారన్నారు. సదరన్ మరణంపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో పుట్టినరోజు జరుపుకోవడానికి అర్ధరాత్రికి ముందు 21 కాక్‌టెయిల్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు కెనడియన్ మహిళలను కలుసుకున్నప్పుడు అతను ఉదయమంతా బ్రాందీ, బీర్ తాగినట్లు తెలిసింది. అతడి మృతదేహాన్ని యూకేకు తిరిగి తీసుకురావడానికి అయ్యే ఖర్చులకు సహాయం కోసం సదరన్ కుటుంబం GoFundMe పేజీ ప్రారంభించింది.