Site icon NTV Telugu

CM KCR: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై కేసీఆర్‌కు బ్రిటన్ ఎంపీ అభినందనలు

Kcr

Kcr

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బ్రిటీష్ ఎంపీ వీరేంద్ర శర్మ అభినందించారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అంబేద్కర్‌ విగ్రహం తెలంగాణకే గర్వకారణమన్నారు. అంబేడ్కర్ ఆలోచనలు భారతదేశ ఆధునిక రాజ్యాంగానికి రూపునిచ్చాయని, అభివృద్ధి, బహుళత్వానికి ప్రాధాన్యతనిచ్చాయన్నారు.

Read Also: Sabitha Indrareddy: తెలంగాణకు ఏం చేశారని చేవెళ్లలో సభ పెడుతుండ్రు..

బ్రిటన్‌లో తెలంగాణ కమ్యూనిటీతో కలిసి పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని లేఖలో బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ పేర్కొన్నారు. త్వరలో కేసీఅర్ బ్రిటన్‌లో పర్యటించాలని వీరేంద్ర శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version