NTV Telugu Site icon

Sneeze : తుమ్మును ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తి… తరువాత పెద్ద షాక్

Sneez

Sneez

ఎవరికైనా తుమ్ము రావడం కామన్. తుమ్ము వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలాంటి సందర్భంలో అయినా తుమ్మడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మన భారతీయ సంప్రదాయంలో బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే అపశకునమని, ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కూడా తుమ్మకూడదని చెబుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో కొంతమంది తుమ్ము ఆపుకుంటూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తుమ్మితే కూడా కొంచెం సేపు కూర్చొని మంచి నీరు తాగి వెళ్లాలని పెద్దలు అంటూ ఉంటారు. సాధారణంగా మన ఇళ్లలో కూడా అలానే చేస్తూ ఉంటాం. అంతేకాకండా తుమ్మిన వెంటనే చిరంజీవా, గాడ్ బ్లెస్ యూ అని కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే తుమ్మినప్పుడు గుండె ఒక సెకను పాటు ఆగుతుంది అందుకే ఎలాంటి ప్రమాదం జరగకుండా పెద్దలు మంచి కోరుకుంటూ దీవిస్తూ ఉంటారు. అందుకే తుమ్మును ఆపుకుంటే పెను ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది. అయితే అందరిలో ఉన్నప్పుడు తుమ్మితే పెద్ద శబ్దం వస్తుందనే భయంతో కూడా కొందరూ తుమ్మకుండా దానిని ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే కొన్ని సందర్బాల్లో అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలానే తుమ్మును ఆపుకున్న ఓ బ్రిటన్ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది.

బ్రిటన్ కు చెందిన ఓ 34 ఏళ్ల వ్యక్తికి పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు తుమ్మువచ్చింది. తుమ్ము పెద్దగా వస్తే బాగోదని పక్కవారికి ఇబ్బంది కలుగుతుందని భావించిన ఆ వ్యక్తి చేతులు అడ్డుపెట్టుకొని తుమ్మును ఆపడానికి ప్రయత్నించాడు. అంతే వెంటనే అతని గొంతులో వాపు వచ్చింది. ఫలితంగా అతని స్వరపేటికలో కూడా సమస్య వచ్చి రంధ్రం ఏర్పడింది. దీంతో అతను ఏది తినాలన్నా, మాట్లాడాలన్నా తీవ్ర నొప్పితో బాధపడేవాడు. అనూహ్యంగా ఆ వ్యక్తి కొన్ని రోజులకు మాటను కూడా కోల్పొయాడు.దీంతో ఆ వ్యక్తి డాక్టర్ ను సంప్రదించగా చికిత్స చేసి కొన్ని రోజుల పాటు నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్‌తో అతనికి ఆహారం అందించారు. వారం రోజుల పాటు అతనికి చికిత్స అందించి డిశార్జ్ చేశారు. ఈ అరుదైన ఘటన గురించి మెడికల్ జర్నల్ BMJ తన రిపోర్ట్ లో పేర్కొంది.

Also Read: Wife and Husband Fighting: రైల్వే స్టేషన్‌లో భార్యభర్తల మధ్య గొడవ.. ఇదేం పెళ్లాం రా బాబు

తుమ్మేటప్పుడు ముక్కు రంధ్రాలు లేదా నోటిని ఎప్పుడూ అడ్డుకోవద్దని సలహా ఇచ్చి ఒక వారం ట్రీట్మెంట్ తర్వాత అతడిని డిశ్చార్జ్ చేశారు. తుమ్ము వచ్చినప్పుడు ముక్కు రంధ్రాలను మూసుకోవడం, తుమ్ము రాకుండా నోటికి చేతులు, రుమాలు అడ్డుపెట్టుకొని ఆపడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా న్యుమోమెడియాస్టినమ్, టిమ్పానిక్ పొర చిల్లులు పడే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సెరిబ్రల్ అనూరిజం చీలిక వంటి అనేక సమస్యలకు దారితీయవచ్చని మెడికల్ రిపోర్ట్ లో డాక్టర్ పేర్కొన్నారు. కాబట్టి ఇకపై మీకు కనుక తుమ్ము వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా తుమ్మేయండి. ఎందుకంటే మనకు ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటం ముఖ్యం కాబట్టి.

Show comments