NTV Telugu Site icon

Brij Bhushan Singh: ఆరుగురు మహిళా రెజ్లర్లపై వేధింపులు.. ఏ అవకాశాన్ని వదులుకోలేదంటున్న పోలీసులు

Brij

Brij

మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల కేసులో   బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ కోర్టులో విచారణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రోజ్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. దీంట్లో కేసు విచారించిన పోలీసులు కొన్ని విషయాలు కోర్టుకు వెల్లడించారు. మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల విషయంలో తనకు చిక్కిన ఏ చిన్న అవకాశాన్నీ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్‌ సింగ్ వదులుకోలేదని కోర్టుకు తెలిపారు. మొదట్లో బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళ రెజర్లు ఆరోపించినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు. అనంతరం సుప్రీం కోర్టు అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశించగా దిగి వచ్చిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read: Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్.. నాలుగు స్టేషన్లలో హాల్ట్

ఢిల్లీ పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ.. బ్రిజ్‌భూషణ్‌కు తాను ఏం చేస్తున్నానో తెలుసని పేర్కొన్నారు. భారతదేశం వెలుపల జరిగిన కేసులకు సీర్పీసీ సెక్షన్ 188 ప్రకారం అనుమతి అవసరమన్న బ్రిజ్‌భూషణ్ తరపు న్యాయవాది వాదనకు  నేరాలన్నీ దేశం బయట జరిగితే మాత్రమే సీర్పీసీ సెక్షన్ 188 ప్రకారం అనుమతి అవసరమని అతుల్ పేర్కొన్నారు. అయితే బ్రిజ్ భూషణ్ విషయంలో ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు జరిగాయని, కాబట్టి అనుమతి అవసరం లేదంటూ అతుల్ కౌంటర్ ఇచ్చారు.  ఆయనపై అభియోగాలు మోపేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీర్పీసీ) కింద రాతపూర్వక ఫిర్యాదు, సెక్షన్ 161 (సాక్షుల విచారణ), 164 (మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన వాంగ్మూలాలు).. ఈ మూడు రకాల సాక్ష్యాలు సరిపోతాయని పేర్కొన్నారు.ఇక జూన్‌ 2న పలు సెక్షన్ల కింద బీజేపీ ఎంపీబ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు వంటి అభియోగాలను కూడా అందులో పేర్కొన్నారు. ఇదిలా వుండగా మహిళా రెజ్లర్లు తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ పలుమార్లు ఖండించారు.

 

 

Show comments