Brij Bhushan Singh: ఆరుగురు మహిళా రెజ్లర్లపై వేధింపులు.. ఏ అవకాశాన్ని వదులుకోలేదంటున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ కోర్టులో విచారణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రోజ్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. దీంట్లో కేసు విచారించిన పోలీసులు కొన్ని విషయాలు కోర్టుకు వెల్లడించారు. మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల విషయంలో తనకు చిక్కిన ఏ చిన్న అవకాశాన్నీ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్ సింగ్ వదులుకోలేదని కోర్టుకు తెలిపారు. మొదట్లో బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళ రెజర్లు ఆరోపించినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు. అనంతరం సుప్రీం కోర్టు అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశించగా దిగి వచ్చిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read: Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్.. నాలుగు స్టేషన్లలో హాల్ట్
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ఢిల్లీ పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ.. బ్రిజ్‌భూషణ్‌కు తాను ఏం చేస్తున్నానో తెలుసని పేర్కొన్నారు. భారతదేశం వెలుపల జరిగిన కేసులకు సీర్పీసీ సెక్షన్ 188 ప్రకారం అనుమతి అవసరమన్న బ్రిజ్‌భూషణ్ తరపు న్యాయవాది వాదనకు నేరాలన్నీ దేశం బయట జరిగితే మాత్రమే సీర్పీసీ సెక్షన్ 188 ప్రకారం అనుమతి అవసరమని అతుల్ పేర్కొన్నారు. అయితే బ్రిజ్ భూషణ్ విషయంలో ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు జరిగాయని, కాబట్టి అనుమతి అవసరం లేదంటూ అతుల్ కౌంటర్ ఇచ్చారు. ఆయనపై అభియోగాలు మోపేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీర్పీసీ) కింద రాతపూర్వక ఫిర్యాదు, సెక్షన్ 161 (సాక్షుల విచారణ), 164 (మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన వాంగ్మూలాలు).. ఈ మూడు రకాల సాక్ష్యాలు సరిపోతాయని పేర్కొన్నారు.ఇక జూన్ 2న పలు సెక్షన్ల కింద బీజేపీ ఎంపీబ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు వంటి అభియోగాలను కూడా అందులో పేర్కొన్నారు. ఇదిలా వుండగా మహిళా రెజ్లర్లు తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ పలుమార్లు ఖండించారు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి