Marriage: ఆస్పత్రే వివాహానికి వేదికైంది. ఆస్పత్రిలోని ఓ గదినే మండపంగా అలంకరించారు. ఏంటీ పెళ్లి కోసం మండపాలు దొరకక అనుకుంటున్నారా..! కాదండోయ్.. ఆ ఆస్పత్రిలోనే పెళ్లి కుమార్తె చికిత్స పొందుతోందట. రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో గల ఎస్‌బీఎస్ ఆస్పత్రి ఈ వినూత్న వివాహానికి వేదికైంది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన యువతిని వివాహం చేసుకునేందుకు ఓ యువకుడు ఊరేగింపుగా అక్కడికి వచ్చి.. ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్నాడు. కోటా జిల్లాలోని రామ్‌గంజ్ మండి ప్రాంతంలోని భావ్‌పురా నివాసి పంకజ్‌కు రావత్‌భటా నివాసి మధు రాఠోడ్‌తో శనివారం వివాహం జరగాల్సి ఉంది.
Punishment: మందుబాబులకు వింతశిక్ష.. స్టేషన్‌లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్
వారి వివాహం ఘనంగా జరిపేందుకు ఇరువురి ఇళ్లలో వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వధువు వివాహ వేదికకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. మెట్లపై నుంచి జారిపడింది. ఈ ఘటనలో ఆమె రెండు చేతులు విరగడంతో పాటు తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. వధువు జారిపడిందని తెలుసుకున్న వరుడి కుటుంబసభ్యులు వెంటనే మండపానికి బయలుదేరారు. ఇరువురి కుటుంబసభ్యులు మాట్లాడుకుని ఆస్పత్రిలోనే పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. పెళ్లి కోసం ఆస్పత్రిలోని గదిని బుక్ చేసుకున్నారు. దానిని అందంగా అలంకరించారు. వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ జంట ఆస్పత్రిలోనే ఒక్కటి కాగా.. వారిని పెద్దలు ఆశీర్వదించారు.