NTV Telugu Site icon

Marriage Cancel: అది చిన్నగా ఉంది.. ఆ అబ్బాయి నాకు వద్దు

Marriage Cancel

Marriage Cancel

Marriage Cancel: చాలా సందర్భాల్లో పెళ్లికొడుకు పొట్టిగా ఉన్నాడనో, నల్లగా ఉన్నాడనో, చెడు అలవాట్లు ఉన్నాయనో, అతడి బ్యాక్‌గ్రౌండ్‌ బాగా లేదనో.. వధువులు పెళ్లి రద్దు చేసిన ఘటనలు చూసి ఉంటారు. ఎక్కడైనా అలాంటి వార్తలు చదివుంటారు. కానీ వరుడి ముక్కు చిన్నగా ఉందని ఓ వధువు ఏకంగా పెళ్లిని క్యాన్సిల్ చేసింది. నిజమేనండి. పెళ్లి కొడుకు ముక్కు చిన్నగా ఉందనే కారణంతో ఓ పెళ్లి కూతురు పెళ్లినే రద్దు చేసేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరుడి కుటుంబం ఊరేగింపుగా వధువు ఇంటికి వచ్చింది. అప్పటికే పెళ్లి కూతురు ఇంటి దగ్గర జనం చేరారు. అందులో ఉన్న కొందరు మహిళల దృష్టి పెళ్లి కొడుకు ముక్కు మీద పడింది. అంతే, అతడి ముక్కు గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. పెళ్లి కొడుకు ముక్కు చిన్నగా ఉందని వారంతా అనుకుంటుండగా.. ఆ మాటలు పెళ్లి కూతురు చెవిన పడ్డాయి. ఇది విన్న పెళ్లికూతురు పెళ్లి క్యాన్సిల్ అని బాంబు పేల్చింది.

Rowdy Gang: రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ చేసి బట్టలిప్పి స్థంబానికి కట్టేసి అరాచకం

పెళ్లి కుమారుడి ముక్కు చిన్నగా ఉంది కాబట్టి తాను వివాహం చేసుకోనని తెగేసి చెప్పింది. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు వధువును ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా.. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో వివాహం అర్ధంతరంగా ఆగిపోయింది. చేసేదేమీలేక వధువు లేకుండానే వరుడు కుటుంబం బ్యాండ్ మేళంతో తిరిగి ఇంటికి వచ్చారు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అయితే, పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. మేము నిమిత్త మాత్రులం అని చేతులు దులుపుకున్నారు. పోలీసులే చేతులెత్తేయడంతో.. ఇక చేసేదేమీ లేదని తెలుసుకున్న వరుడి ఫ్యామిలీ.. అక్కడి నుంచి నిరాశతో వెనుదిరిగింది. ఇలాంటి కేసు ఎప్పుడూ తన దృష్టికి రాలేదని అస్మోలీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ తెలిపారు.