NTV Telugu Site icon

FIFA World Cup 2022: ఒక్కటే గోల్‌.. కామెరూన్‌పై స్విట్జర్లాండ్ విజయం

Fifa World Cup

Fifa World Cup

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్‌ కప్‌లో భాగంలో భాగంగా గురువారం అల్-వక్రాలోని అల్ జనోబ్ స్టేడియంలో జట్ల మధ్య జరిగిన గ్రూప్-జీ మ్యాచ్‌లో కామెరూన్‌పై స్విట్జర్లాండ్ 1-0తో విజయం సాధించింది. బ్రీల్ ఎంబోలో గేమ్ ఏకైక గోల్ చేయడంతో స్విట్జర్లాండ్ విజయం సాధించింది. కామెరూన్ ఆధిపత్య దిశగా గేమ్‌ను ప్రారంభించింది. స్విట్జర్లాండ్‌కు కూడా ప్రారంభంలోనే అవకాశాలు ఉన్నా.. ఆట ప్రథమార్థంలో గోల్‌ చేయలేకపోయింది. అయితే సెకండాఫ్‌లో, 48వ నిమిషంలో ఎంబోలో గోల్‌ చేసి స్విట్జర్లాండ్‌కు విజయాన్ని సాధించి పెట్టాడు.

Amazon founder warned about recession: చంద్రబోస్ చక్కని పాట.. అమేజాన్ ఫౌండర్ మంచి మాట..

ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక ఆటగాడు గోల్‌ కొట్టాడంటే ఎంతో గొప్పగా చూస్తారు. మామూలు మ్యాచ్‌ల్లో గోల్‌ కొడితే పెద్దగా కిక్‌ రాదు. కానీ ఫిఫా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు అలా కాదు. ఎందుకంటే నాలుగేళ్లకోసారి జరిగే సాకర్‌ సమరంలో గోల్స్‌ కొట్టిన ఆటగాడు హీరో అయితే కొట్టనివాడు జీరో అవుతాడు. కానీ తాజాగా గురువారం స్విట్జర్లాండ్‌, కామెరూన్‌ మ్యాచ్‌లో గోల్‌ కొట్టిన ఒక ఆటగాడు మాత్రం దానిని సెలబ్రేట్‌ చేసుకోలేకపోయాడు. అతనే స్విట్జర్లాండ్‌ తరఫున గోల్‌ కొట్టిన బ్రీల్ ఎంబోలో. అతని గోల్‌ పుణ్యానే ఇవాళ స్విట్జర్లాండ్‌ మ్యాచ్‌ను గెలిచింది. మరి ఇంత చేసిన బ్రీల్‌ ఎంబోలో ఎందుకు సెలబ్రేట్‌ చేసుకోలేదా అనే డౌట్‌ వస్తుంది. కారణమేమిటంటే అతను గోల్‌ కొట్టింది తన సొంత దేశమైన కామెరూన్‌పై కావడమే. బ్రీల్ ఎంబోలో స్వస్థలం కామెరూన్‌.. ఎంబోలో కూడా అక్కడే పుట్టి పెరిగాడు. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల స్విట్జర్లాండ్‌కు రావాల్సి వచ్చింది. ఇప్పటికి అతని తల్లిదండ్రులు కామెరున్‌ వెళ్లి వస్తుంటారు. అందుకే జట్టుకు గోల్‌ అందించినప్పటికీ సెలబ్రేట్‌ చేసుకోలేకపోయాడు.