Site icon NTV Telugu

Breast cancer: చిన్న వయసులోనే రొమ్ము క్యాన్సర్.. ఆ ఉత్పత్తుల ప్రభావమేనా.?

Breast Cancer

Breast Cancer

Breast cancer: కొన్ని దశాబ్దాల క్రితం వరకు రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా తక్కువగా ఉండేవి. వచ్చినా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన మహిళల్లో కనిపించేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఐదేళ్లలో ఈ వ్యాధి కేసులు పెరగడమే కాకుండా, ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు కూడా దీని బారిన పడుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నప్పటికీ, కొన్ని పరిశోధనల్లో కాస్మొటిక్ ఉత్పత్తులు కూడా ఈ వ్యాధి ప్రమాదానికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Ranchi: వెజ్ బిర్యానీకి బదులు నాన్‌వెజ్ బిర్యానీ వడ్డన.. చివరకు?

ఓ ప్రముఖ సమస్త ప్రచురించిన పరిశోధన ప్రకారం.. కాస్మొటిక్ ఉత్పత్తుల్లో ప్రిజర్వేటివ్‌లుగా ఉపయోగించే అనేక రకాల రసాయనాలు ఉంటాయి. ఈ ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు, ఈ రసాయనాలు చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి మహిళల శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ పనితీరును ప్రభావితం చేయవచ్చని, తద్వారా కణితి (ట్యూమర్) ప్రమాదాన్ని పెంచవచ్చని పరిశోధన పేర్కొంది. అయితే, ఈ విషయంలో నిర్ధారణ స్పష్టంగా లేదని పరిశోధకులు తెలిపారు. ఈ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ వాటి వినియోగాన్ని పరిమితం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

Prabhas – Sukumar: సుక్కు – ప్రభాస్ కాంబో సెట్టు.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!

కాస్మెటిక్ ఉత్పత్తులు చర్మానికి హాని కలిగించవచ్చు. కానీ, రొమ్ము క్యాన్సర్‌తో వీటికి ప్రత్యక్ష సంబంధం లేదని ఆమె అన్నారు. అయితే, తక్కువ వయసులో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అని డాక్టర్లు తెలిపారు. మహిళల్లో ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు పెరగడం కూడా ఈ క్యాన్సర్ ప్రమాద కారకాలుగా మారుతున్నాయి. గతంలో తక్కువ వయసులో క్యాన్సర్ కేసులు చాలా అరుదుగా ఉండేవని.. కానీ ఇప్పుడు 35 నుంచి 40 ఏళ్ల మహిళల్లో కూడా కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం వ్యాధి నిర్ధారణ మెరుగుపడటం, మహిళల్లో ఈ వ్యాధిపై అవగాహన పెరగడం కూడా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవడానికి ఒక కారణమని ఆమె వివరించారు. రొమ్ము క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలలో.. రొమ్ము లోపల లేదా చుట్టుపక్కల గడ్డ (లంప్) ఏర్పడటం, రొమ్ము ఆకారం లేదా పరిమాణంలో మార్పు రావడం వంటివి జరుగుతాయి. ఇక రొమ్ము చర్మంలో గుంటలు పడటం, చనుమొన లోపలికి ముడుచుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

Exit mobile version