రాజ్యసభ సభ్యురాలుగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రమాణస్వీకారం చేశారు. సోనియా గాంధీ చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా సోనియాగాంధీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. వీరిని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఇక తెలంగాణ నుండి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వద్దిరాజు రవిచంద్ర తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి అందరిని ఆశర్యపరిచారు.
Also read: Harish Rao: ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది..
