NTV Telugu Site icon

Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట..!

15

15

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత శుక్రవారం మార్చి 22 న ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్‌ సంబంధించి గురువారం కోర్టు విచారణ జరుపనున్నది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన విషయం విదితమే. ఢిల్లీకి చెందిన సుర్జీత్‌ సింగ్‌ యాదవ్‌ రైతు, సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఈయన పిటిషన్‌ దాఖలు చేశారు. కేజ్రీవాల్ ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన నేపథ్యంలో పదవిలో ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.

Also read: Chandrababu: కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే..

కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం న్యాయ ప్రక్రియకు ఆటంకాలు కలుగుతాయని.. దాంతో న్యాయ ప్రక్రియను అడ్డుకోవడమే మాత్రమే కాకుండా.. రాజ్యాంగ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాత్కాలిక బెయిల్‌ ను మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నేటితో కేజ్రీవాల్ కస్టడీ ముగిస్తున్న నేపథ్యంలో.. మరో వారం రోజుల పాటు ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also read: MLC Jeevan Reddy: బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ప్రజలు ఓట్లు వేయండి..

ఇక జైలు నుంచి పాలన విషయంలో కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించింది.. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న పిల్ ను తాజాగా హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ ను విచారణ నిమిత్తం రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించింది ఈడీ.

Show comments