NTV Telugu Site icon

Breaking News: లిక్కర్ కేసు ఛార్జ్ షీట్ పై మరోసారి వాయిదా..

Breaking News

Breaking News

Breaking News CBI Kavitha: ఢిల్లీలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ లో భాగంగా కవితనే కీలక సూత్రధారి అని ఆరోపించిన సీబీఐ.. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం లాంటి పనులు చేసిందని తెలిపింది. ఇలా ప్రతిదీ కవిత కనుసన్నల్లోనే జరిగాయని., ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండడం పట్ల ఈడీ, సీబీఐ ఆరోపించడంతో న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టి వేసి ఆమె కస్టడీని పొడిగిస్తూ వస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో నేడు లిక్కర్ కేసు విచారణ జరిగింది.

Tollywood: హిట్టు కొట్టలేదంటే ఆ ముగ్గురు హీరోల పరిస్థితి అంతే సంగతులు

నేడు లిక్కర్ కేసులో సీబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ న్యాముర్తులు చేపట్టనున్నారు. నేడు కవిత తోపాటూ ఇతర నిందితులను వర్చువల్ గా కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరు పపరిచారు. ఈ కేసును జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు. సీబిఐ కేసులో A17 గా కవిత ఉంది. సీబిఐ ఛార్జ్ షీట్ ను స్క్రూటినీ చేసేందుకు కొంత సమయం కావాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దానికి ఇప్పటికే సమయం ఇచ్చామన్న జడ్జి కావేరి బవేజా అన్నారు. దింతో కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 9 కి వాయిదా వేశారు.

Game Changer: దిల్ రాజా ఆ విషయం సీరియస్గా తీసుకున్నట్టున్నాడే?