తాజాగా ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ శుక్రవారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారు. హైదరాబాదులోని మలక్ పేటలో ఉన్న యశోద ఆసుపత్రిలో గుండెపోటు అనంతరం చికిత్స పొందుతూ ఆయన కోలుకోలేక మృతి చెందాడు. ప్రస్తుత తరం వారికి అంతగా తెలియకపోయినా.. ముందుతరం వారికి తెలుగు దూరదర్శన్ అంటే మొదటిగా చెప్పే పేరు శాంతి స్వరూప్. రాత్రి అయితే చాలు ఆయన వార్తలు చదవటానికి ప్రత్యక్షమవుతారు.
Also Read: Living Relationship Murder: నెలన్నరగా లివ్ ఇన్ రిలేషన్షిప్.. ఆపై మర్డర్..?!
ఇక 1977 అక్టోబర్ 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను మొదలుపెట్టగా.. అందులో మొట్టమొదటిగా తెలుగు యాంకర్ గా శాంతి స్వరూప్ పనిచేశారు. ఇప్పుడంటే న్యూస్ చదివే వారికి టెలీప్రాంప్టర్ ఉంది. అయితే టెలీప్రాంప్టర్ లేని రోజులలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా న్యూస్ చదివి అందరి మన్నలను పొందాడు శాంతి స్వరూప్. ఇలా ఆయన 2011లో దూరదర్శన్ నుండి పదవి విరమణ పొందాడు.
Also Read: Anupama Parameswaran : జానకిగా వచ్చేస్తున్న లిల్లీ..
ఇక ఈయన మరణ వార్తను తన కుటుంబ సభ్యులు ధ్రువీకరిస్తూ.. ఆయన ఇక లేరని తెలిపారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో యశోద హాస్పిటల్ లో చేరిన ఆయన నేటి ఉదయం మృతి చెందారు. శాంతి స్వరూప్ పట్ల రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, అలాగే జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.