Video Viral: ఆడవాళ్ల వ్యవహారాల్లో తలదూర్చొద్దని పెద్దలు చెప్పే మాట.. ముఖ్యంగా ఆడవాళ్లు గొడవ పడుతుంటే.. ఆపే ప్రయత్నం చేసినా కష్టమే మరి.. రాజ్‌కోట్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అది రుజువు చేసింది.. రాజ్‌కోట్‌లోని యాగ్నిక్ రోడ్డులో ఇద్దరు బాలికల మధ్య జరిగిన ముష్టియుద్ధానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వాహనాన్ని ఓవర్‌టెక్ చేసే విషయంలో ఇద్దరు యువతుల మధ్య వాగ్వాదం జరగడంతో.. ముష్టియుద్ధానికి దిగారు.. వారు ఇద్దరూ తీవ్రంగా కొట్టుకుంటుంటే చుట్టుపక్కల వ్యాపారులు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అలాగే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: PM Modi Tour: రోడ్‌షోలో ప్రధాని మోడీకి సైకిలిస్టులు స్వాగతం.. మోడీ మోడీ నినాదాలు
వివరాల ప్రకారం.. రాజ్‌కోట్ నగరంలోని యాగ్నిక్ రోడ్డులో బైక్ క్రాసింగ్ విషయంలో నిన్న మధ్యాహ్నం ఇద్దరు బాలికల మధ్య ఘర్షణ జరిగింది. కొద్ది నిమిషాల్లోనే గొడవ తీవ్రస్థాయికి చేరి ఇద్దరు బాలికల మధ్య తోపులాట జరిగింది. చుట్టుపక్కల వ్యాపారులతో పాటు రోడ్డుపై పాదచారులు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మరియు అక్కడ నిలబడి ఉన్న ఒక బాటసారి ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య జరుగుతోన్న ఫైటింగ్‌ను ఆపే ప్రయత్నం చేశాడు.. ఇద్దరి మధ్యలో దూరి సముదాయించే ప్రయత్నం చేశాడు.. కానీ, ఆ యువకుడిపై మరో యువతి దాడి చేసింది.. నీకెందుకు అన్న విధంగా అతడికి కూడా కొట్టే ప్రయత్నం చేసింది. ఇక, ఈ వ్యవహారం పోలీసులకు కూడా చేరడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారిద్దరీ మధ్య జరుగుతోన్న ఫైటింగ్‌ను ఆప గలిగారు.. చుట్టుపక్కల చేరినవారిని చెదరగొట్టారు. అయితే, ఇద్దరు యువతుల మధ్య జరిగిన ఆ ఘర్షణను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాకు ఎక్కించడంతో.. నెట్టింట రచ్చ చేస్తోంది.
