NTV Telugu Site icon

S. S.Rajamouli: ఓటీటీలో దూసుకుపోతున్న బ్రహ్మాస్త్ర.. ఫలించిన జక్కన్న స్ట్రాటజీ

Bramhastra

Bramhastra

S. S.Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు ఇండియన్ సినిమాకు పితామహుడిగా మారిపోయారు. తన మార్కెటింగ్ స్ట్రాటజీలతో తీసిన సినిమాలను బ్లాక్ బస్టర్ చేయడంతో బాలీవుడ్ సైతం అతడికి దాసోహం అంటోంది. బాలీవుడ్ మేకర్స్ తీసిన సినిమాల ప్రమోషన్ల కోసం రాజమౌళిని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారుతున్నారు. ఆయనను ముందు పెట్టి తమ సినిమాలను ప్రమోషన్లు చేస్తున్నారు బీటౌన్ నిర్మాతలు. దీంతో సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి.

Read Also: Janvi kapoor: కొత్త ఇల్లు కొన్న శ్రీదేవి కూతురు.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఇదే క్రమంలో బ్రహ్మాస్త్ర సినిమాకు రాజమౌళినే బ్రాండ్ అంబాసిడర్.. ఈ సినిమాను దక్షిణాదిలో రాజమౌళి సమర్పణలో రిలీజ్ చేశారు మూవీ టీం. రాజమౌళి ఈ సినిమాను టాలీవుడ్, కోలీవుడ్ , శాండివుడ్‌లలో ప్రమోట్ చేశారు. తనదైన స్టైల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్‌తో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేశారు జక్కన్న. తాజాగా ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమ్‌ అవుతుంది. అందులో ఈ మూవీకి విపరీతంగా.. రెస్పాన్స్ వస్తుంది. దీంతో సినిమా నిర్మాతలు కరణ్ జోహార్, అయాన్ ముఖర్జి ఖుషీ అవుతున్నారు. రికార్డు లెవల్‌ వ్యూవ్‌ అవర్స్‌ రికార్డవుతోంది.

Show comments