Brahmaji : ప్రస్తుతం భారతదేశంలో మొత్తం.. ఏ సినిమా గురించి మాట్లాడుతుందంటే.. అది ఏకైక సినిమా కల్కి 2898 Ad గురించి మాత్రమే అన్నట్లుగా చర్చలు సాగుతున్నాయి. టాలీవుడ్ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ గా రిలీజ్ అయ్యి వసూళ్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 555 కోట్లు వసూలు చేసిందని చిత్రం బృందం తెలిపింది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సినీ అభిమానులను మెప్పించడంతో భారీ విజయాన్ని అందుకుంది. భారీ వసూళ్ల నేపథ్యంలో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. కల్కి సినిమా రిలీజ్ తర్వాత సినిమాను చూసిన అగ్రతారాలతో పాటు సినీ ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసల జల్లులను కురిపించారు.
SVC 58 : వైరటీ పోస్టర్ తో వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం అనౌన్స్మెంట్..
అందరికంటే ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. తెలుగు చిత్రాన్ని మరోసారి ప్రపంచానికి గ్రాండ్ గా పరిచయం చేశాడు. ఇక ఈ సినిమాకు అందరూ వారి స్టైల్లో ప్రశంసలు కురిపిస్తున్న సమయంలో.. తాజాగా ప్రముఖ నటుడు బ్రహ్మాజి కూడా తనదైన కామెడీ టైమింగ్ ను కలిపి సినిమా మేకర్స్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
Bharateeyudu 2 : భారతీయుడు 2 నుండి వావ్.. అనేలా “క్యాలెండర్ సాంగ్”
ముఖ్యంగా.. నాగ్ అశ్విన్ ను ట్యాగ్ చేస్తూ మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే తాను ముద్దు పెట్టుకుంటానని అంటూ.. తెలుగు సినిమా అనుకుంటే, వరల్డ్ సినిమా తీశారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే థాంక్యూ.. ప్రియాంక, స్వప్న. మీ రిస్కులే.. మీకు శ్రీరామరక్ష.. అంటూ బ్రహ్మాజీ తనదైన స్టైల్ లో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
తెలుగు సినిమా అనుకొంటే world సినిమా తీశారు .@nagashwin7 గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను ❤️..thank యూ ప్రియాంక ..స్వప్న ..
మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష 🙏🏼 .#Kalki2808AD 🔥@VyjayanthiFilms 🙏🏼— Brahmaji (@actorbrahmaji) July 1, 2024