NTV Telugu Site icon

Boyapati : బాలయ్యతో బోయపాటి సినిమా ఇప్పట్లో లేనట్లేగా..?

Whatsapp Image 2023 07 03 At 12.53.45 Pm

Whatsapp Image 2023 07 03 At 12.53.45 Pm

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెల్సిందే.బాలయ్య
అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాల భారీ విజయం తో మంచి జోరు మీద వున్నారు.భగవంత్ కేసరి సినిమా తో మరో భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు బాలయ్య.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురు గా నటించబోతుంది. ఈ సినిమా నుండి విడుదలయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాను దసరా కానుక గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయబోతున్నట్లు అంతా కూడా భావించారు. కానీ ఇప్పటి వరకు బోయపాటి బాలయ్య సినిమా గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.కనీసం కథ రెడీ అయినట్లు గా కూడా వార్తలు రాలేదు.

బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వం లో మూడు భారీ సినిమాలు వచ్చాయి.ఆ మూడు సినిమా లు కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి.అందుకే  బాలయ్య ఫ్యాన్స్ అంతా కూడా వీరిద్దరి కాంబో లో మరో సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూశారు. కానీ ప్రస్తుతం బాలయ్య తన తరువాత సినిమాను బాబీ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.. బోయపాటి శ్రీను తో బాలయ్య మరో సినిమా చేసే అవకాశం ఉంది కానీ ఆ సినిమా ఎప్పుడూ చేస్తాడో అయితే క్లారిటీ లేదు. మరీ వీరిద్దరి కాంబో కోసం ఇంకొన్నాళ్ళు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికి భగవంత్ కేసరి సినిమా పై పూర్తి దృష్టి పెట్టారు బాలయ్య.ఆ సినిమా పూర్తి అయిన తరువాత బాబీ సినిమా తో బిజీ కానున్నారు.

Show comments