Balakrishna and Boyapati : నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇండస్త్రీ హిట్ సినిమాలు వచ్చాయి. అంతేకాకుండా వీరి మధ్య ఉండే అనుబంధం ఏంటో అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్, అఖండ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టారు. వీరి కాంబినేషన్లో సినిమా అంటేనే బాక్సాఫీస్ రికార్డులు తప్పక బద్దలు అవుతాయి అని నమ్మకం. ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావి పూడితో తన 108వ సినిమా లో బిజీగా ఉన్నారు. తరువాత చిత్రం బోయపాటితో చేస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారన్న వార్త హల్ చల్ చేస్తోంది. అంటే తన అభిమాన హీరోతో బోయపాటి ఇప్పుడు పోటీ పడబోతున్నారట.
Read Also: Music director Chakri death: అన్నయ్య మరణంపై అనుమానం ఉంది : చక్రి తమ్ముడు
బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా దసరాకి విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ పోస్టర్లో చెప్పకనే చెప్పింది. బాలకృష్ణ మాస్ లుక్కుతో వచ్చిన ఈ పోస్టర్లు ఆయుధాల పూజ అని పెట్టడంతో ఈ సినిమా దసరాకి రాబోతుందని అర్థం అవుతోంది. మరోపక్క బోయపాటి శ్రీను- రామ్ పోతినేని కాంబినేషన్లో సినిమా కూడా దసరాకే రాబోతోంది. ఈ సినిమాని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నాం కొద్దిరోజుల క్రితమే మేకర్స్ తెలియజేశారు. అయితే దసరా సందర్భంగా రాబోతున్న బాలకృష్ణ సినిమా అక్టోబర్ 21న రిలీజ్ చేయాలనుకుంటున్నారంట ఆ సినిమా మేకర్స్. మరి బాలయ్య డేట్ ఫిక్స్ అయితే మాత్రం దసరా పోరు మరింత రసవత్తరంగా మారినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
