NTV Telugu Site icon

Viral Video: అరె ఏంట్రా ఇది.. ఇద్దరు యువతులతో ఒకేసారి కారులో సరసాలు!

Boy Romance

Boy Romance

Boy Kisses Two Girls in Car at UP: ఇటీవలి కాలంలో యువతీయువకులు రెచ్చిపోతున్నారు. కొన్ని ప్రేమ జంటలు అయితే నడిరోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ బరితెగిస్తున్నారు. నలుగురు చూస్తారనే ఇంగితం కూడా లేకుండా ముద్దుల్లో మునిగి తేలిపోతున్నారు. తాజాగా ఇలాంటి వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఓ అబ్బాయి ఇద్దరు యువతులతో ఒకేసారి కారులో సరసాలు ఆడడం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వీడియో ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి ప్రాంతంలో లక్నో-అయోధ్య ఎన్‌హెచ్ 27లో ఈ ఘటన జరిగింది. కొత్వాలి ఏరియా పరిధిలోని సఫేదాబాద్‌లోని కాళికా హవేలీ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఓ ఇన్నోవా కారు పార్క్ చేసి ఉంది. డ్రైవర్ సీట్లో ఓ అమ్మాయి కూర్చుని ఉండగా… వెనకాల ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. యువకుడు కారులో ఇద్దరు యువతులతో ఒకేసారి రొమాన్స్ చేశాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఒకరు మొబైల్ ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Also Read: Sanju Samson: సంజూ శాంసన్‌కు దక్కని చోటు.. ఇక కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

ఈ వీడియో @Nishantjournali అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ దృశ్యం చూసిన వాళ్లు అవాక్కవుతున్నారు. ‘అరె ఏంట్రా ఇది’, ‘యువత మరీ దిగజారిపోతుంది’, ‘బరి తెగింపుకు ఇది పరాకాష్ఠ’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కారుకు బీజేపీ జెండా ఉండడం విశేషం. ఓ బీజేపీ లీడర్ ప్రమాదానికి గురైన తర్వాత రిపేర్ కోసం కారును మెకానిక్ షాపులో ఇచ్చాడని పోలీసులు తెలిపారు. బీజేపీ లీడర్‌కు దీనితో అలంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

Show comments