NTV Telugu Site icon

Boy On Train Wheels: రైలు కింద చిక్కుకొని 100 కి.మీ. ప్రయాణించిన బాలుడు.. వీడియో వైరల్..

Train Boy

Train Boy

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ బాలుడు గూడ్స్ రైలు కింద చక్రాలలో ఇరుక్కొని ఏకంగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే స్టేషన్ దగ్గరలో నివాసం ఉంటున్న ఓ పిల్లాడు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి ఆడుకుంటుండగా ఆ సమయంలో అక్కడే ఆగి ఉన్న లక్నోకు వెళ్లాల్సిన ఓ గూడ్స్ రైలులోకి ఎక్కి కూర్చున్నాడు. అయితే అనుకోకుండా గూడ్స్ రైలు ఆకస్మాత్తుగా కదలడంతో ఆ బాలుడు కిందికి దిగడానికి భయపడిపోయాడు.

Also Read: Pemmasani Chandrasekhar: నా విజయం ఖరారు.. భారీ మెజార్టీ సాధిస్తా

దాంతో ఆ పిల్లోడు బిక్కుబిక్కుమంటూ రైలు చక్రాల మధ్య ఉండే చిన్నని గ్యాప్ లో కూర్చుని ప్రమాదకరస్థాయిలో ఏకంగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. అలా ప్రయాణం చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని హార్దోయ్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఇకపోతే రైలు సిబ్బందికి చక్రాల మధ్య కూర్చున్న బాలుడు కంటపడటంతో వారు ఆర్పిఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు.

Also Read: RR vs MI: దూకుడుతో ఉన్న రాజస్థాన్ ను ముంబై నిలవరిస్తుందా..

దాంతో వెంటనే బాలుడు వద్దకు ఆర్పిఎఫ్ సిబ్బంది చేరుకొని చక్రాల మధ్య గ్యాప్ లో నుంచి బయటికి తీశారు. ఇక విచారణలో భాగంగా పిల్లాడి కుటుంబం అలంనగర్ రాజాజీపురం లోని బాలాజీ మందిర్ లో నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దాంతో ఆ పిల్లాడిని చైల్డ్ కేర్ హోమ్ కు తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments