Site icon NTV Telugu

UP slab falls: రీల్స్ కోసం బాలుడు ఎంత పని చేశాడు.. చివరికిలా ముగిసింది!

See

See

సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించేందుకు కొంత మంది ప్రాణాంతకమైన సాహసాలు చేసి కన్న తల్లిదండ్రులకు దు:ఖాన్ని కలుగజేస్తున్నారు. ఈ మధ్య యూత్ విపరీతమైన ధోరణిలోకి వెళ్లిపోతుంది. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక.. ఇష్టానురీతిగా ప్రవర్తిస్తున్నారు. లైకులు కోసమో… లేకపోతే క్రేజీ కోసమో తెలియదు గానీ.. ఉత్తి పుణ్యాన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ.

 

రీల్స్ వ్యామోహంలో పడిన ఓ బాలుడు అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ కోసం రీల్ రికార్డ్ చేయడానికి బండాలోని స్కూల్‌ దగ్గర 17 ఏళ్ల బాలుడు తలక్రిందులుగా వేలాడూ ఎక్సర్‌సైజులు చేశాడు. అనంతరం స్లాబ్‌పై నుంచి పడి మరణించాడు. 11 సెకన్ల వీడియోలో శివమ్ అనే బాలుడు స్లాబ్ మీద కాళ్లు పెట్టి తలకిందులుగా వేలాడుతూ వ్యాయామం చేశాడు. అనంతరం పాఠశాల టెర్రస్ నుంచి కిందపడి శివం మృతి చెందినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని బండాలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.

ఇది కూడా చదవండి: Amit shah: ఎన్నికల బాండ్ల స్కీమ్‌పై రాహుల్‌కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడంపై మండిపడుతున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూడండి.

 

Exit mobile version