NTV Telugu Site icon

Mosquito Liquid: విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి

Mosquito Liquid

Mosquito Liquid

Mosquito Liquid: హైదరాబాద్ నగరంలోని చందానగర్‌ పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. చందానగర్‌ పీఎస్‌ పరిధిలోని తారానగర్‌లో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున మస్కిటో లిక్విడ్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. తారానగర్‌కి చెందిన జుబేర్ కొడుకు అబ్బు జాకీర్ ఆడుకుంటూ అనుకోకుండా ఆలౌట్ లిక్విడ్ తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

Read Also: Crime News: ఛీఛీ.. కామాంధుడు.. కన్నకూతురినే గర్భవతిని చేసి..

బాలుడి బట్టలపై ఆలౌట్ లిక్విడ్ వాసన రావడంతో గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి త‌ర‌లించ‌గా, అప్పటికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మరణంతో త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

Show comments