NTV Telugu Site icon

Botsa Satyanarayana : అచ్చెన్నాయుడు అలా మాట్లాడటం దురదృష్టకరం

Botsa Satyanaranayan

Botsa Satyanaranayan

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య నారాయణ స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి బొత్ససత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు అందరు సుఖంగా ఉండాలని సూర్య దేవున్ని కోరుకున్నానన్నారు. లోకేష్ పాదయాత్ర జాగ్రత్తగా చేస్తే ఆరోగ్యం బాగు పడుతుందని.. ఏమైనా తేడా వస్తే ఆరోగ్యం చెడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పరిణితి చెందిన అచ్చెన్నాయుడు అలా మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడు రాజకీయాల్లో ప్రజాజీవితంలో ఉన్నారో లేకబైట ఉన్నారో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. మాట్లాడితే ఏకవచనం, లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని, ఇలాంటి వారి వల్ల ప్రజల్లో రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో పలచన అవుతున్నామన్నారు. వ్యవస్థలను గౌరవించుకోవాలి, మన పరిమితుల్లో మాట్లాడుకోవాలని ఆయన హితవు పలికారు. అచ్చెన్నాయుడు మాటలు నేనే కాదు సభ్యసమాజం హర్షించడంలేదని ఆయన అన్నారు.

Also Read : Venkatesh: ఒక్క హిట్ తో వచ్చిన అవకాశం.. ఒక్క ప్లాప్ తో పాయే..?

అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడుతారని ఆయన మండిపడ్డారు. అసభ్యపదజాలం వాడటం కరెక్ట్ కాదు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి మాటలు పునరావృతం కాకుండా ఉంటే ఆయనకే కాదు రాజకీయ విలువలు పెరుగుతాయని, లోకేష్ పాదయాత్రకు ఎవరు అడ్డంకులు సృష్టిస్తారు.. పాదయాత్రకు ఇబ్బందులు ఏందుకు పెడతాం.. పరిమిషన్ ఉందని రోడ్డుమీద ఊరేగం కదా అని ఆయన అన్నారు. తాటకు చప్పుళ్లుకు ఏవడూ భయపడడని, లోకేష్ పాదయాత్రని ఎవడు గుర్తిస్తాడని, ఆతడి కంటే అచ్చెన్నాయుడు పాదయాత్ర చేస్తే మరో ఐదుగురు ఎక్కువ మంది వస్తారన్నారు.

Also Read : Novok Djokovic : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. నాదల్ రికార్డ్ సమం