NTV Telugu Site icon

Botsa Satyanarayana: ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు. ఫ్లోర్‌ లీడర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేఖ రాశారు. బొత్సను శాసనమండలి పక్ష నేతగా నిర్ణయిస్తూ పార్టీ నుంచి అధిష్ఠానం లేఖ ఇవ్వనుంది. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి ప్రభుత్వం దూరంగా ఉండడంతో వైసీపీ నుంచి బొత్స సత్యానారాయణ మాత్రమే బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మండలి ఛైర్మన్‌ మోషేన్‌ రాజు తన ఛాంబర్‌లో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు పాల్గొన్నారు.

Read Also: CM Chandrababu: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట

ఇక, ఈ సందర్భంగా బొత్సను అభినందించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. స్ధానిక సంస్ధల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసేముందు వైఎస్‌ జగన్‌ను బొత్స కలవడంతో.. ఆయనను అభినందించారు.