Site icon NTV Telugu

Botsa Satyanarayana : నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పబొతున్నాం

Botsa Satyanarayana

Botsa Satyanarayana

నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 175 నియోజక వర్గాలలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర బస్సు యాత్ర ఇచ్చాపురంలో ప్రారంభమవుతుందని, సీఎం ప్రమాణ స్వీకారం తరువాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎలాంటి సముచిత స్థానం ఇచ్చారొ చెబుతామన్నారు బొత్స సత్యనారాయణ. బడుగు బలహీన వర్గాలకు ఆర్దిక పరిపుష్డి చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని, నాలుగున్నర ఏండ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్ప బొతున్నామన్నారు బొత్స సత్యనారాయణ. గత ఐదేళ్లలో ఏవిధంగా ప్రజా దనం దుర్వినియొగం చేసారో చెబుతామన్నారు. రాబోయే రోజులలో ఏం చేయబోతున్నామో తెలియజేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Israel Hamas War: గాజాలో విషాదం.. అల్ జజీరా జర్నలిస్టు భార్య, కొడుకు, కూతురు, మనవడు మృతి

టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోలు తీసుకొచ్చినా వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ఆయన జోస్యం చెప్పారు. ‘అప్పులు చేసి.. ఆ నిధులను అభివృద్ధికి, సంక్షేమానికి వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేశాం. ఈ నాలుగున్నరేళ్లలో ఎంతో చేశాం. వచ్చే ఎన్నికల్లో మాకు ఎందుకు ఓటేయరని ప్రజలను అడుగుతాం అని బొత్స పేర్కొన్నారు. ఇకపోతే, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటిని న్యాయస్థానాలు నమ్మాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి జరిగిందని తామూ నమ్ముతున్నామన్నారు. సమగ్ర దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజాలు బయటపడతాయన్నారు.

Also Read : Amith Shah: తెలంగాణలో అమిత్ షా టూర్.. షెడ్యూల్ ఇదీ..

Exit mobile version