NTV Telugu Site icon

Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్న బోరిక్ జాన్సన్

Rishi Sunak, Boria Johnson

Rishi Sunak, Boria Johnson

Rishi Sunak : బ్రిటిష్ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక రేసు నుంచి వైదొలుగుతున్నట్లు బోరిస్ జాన్సన్ అందరినీ ఆశ్చర్యపర్చే ప్రకటన చేశారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీ రేసులో తాను నిలుస్తున్నట్లు భారత సంత‌తి నేత రిషి సునక్ నిన్న అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి రిషి సునక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచినా, చివరకు లిజ్‌ ట్రస్ చేతిలో రిషి సునక్ ఓడిపోయారు.

Read Also: Anudeep : షారూఖ్‎తో చేయాలని ఉంది.. ‘జాతిరత్నం’ మనసులో మాట

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభంతో లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. మరో మారు ప్రధాని ఎన్నిక షురూ అయింది. రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ అందరికంటే ముందున్నారు. తాజాగా, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం అర్ధరాత్రి తర్వాత ప్రకటించారు. దీంతో రిషి సునాక్‌కు దాదాపు మార్గం సుగమం అయినట్టే. దేశ ప్రయోజనాలు, కన్జర్వేటివ్ పార్టీని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. తనకు 100 మందికి పైగా ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ తమ పార్టీ ఐక్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Read Also: Terrorist Attack: సోమాలియాలో హోటల్​పై ఉగ్రవాదుల దాడి.. 9 మంది మృతి.. 47 మందికి గాయాలు

ప్రధాని పదవికి పోటీచేస్తున్న రిషి సునాక్‌.. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తానని హామీ ఇచ్చారు. కన్వర్వేటివ్‌ పార్టీకి నాయకత్వం వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. గతంలో దేశం కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కరోనా సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించానని.. తన సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని కన్జర్వేటివ్‌ సభ్యులను సునాక్ కోరారు. ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన కనుక బాధ్యతలు స్వీకరిస్తే బ్రిటిష్ ప్రధాని అయిన మొదటి భారత సంతతి నేతగా నిలుస్తారు. ఆయనకు ప్రస్తుతం 144 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే అభ్యర్థిపై కన్జర్వేటివ్ పార్టీ ఏకాభిప్రాయానికి వస్తే రిషి సునక్ ను ఇవాళ సాయంత్రంలోపు తమ పార్టీ నాయకుడిగా, బ్రిటిష్ ప్రధానమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇద్దరు అభ్యర్థులకు మించితేనే పార్టీ సభ్యులు ఓటు వేయనున్నారు. కొత్త ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ అక్టోబరు 31న విడుదల చేయబోయే బడ్జెట్ ప్రణాళికలో దేశ ఆర్థిక స్థితిని తెలియజేయడానికి కొద్ది రోజుల ముందు విజేతను ప్రకటించనున్నారు.

Show comments