Bootcut Balaraju: ఓటీటీలోకి వచ్చేస్తున్న బిగ్‌బాస్ సోహెల్ బూట్‌కట్ బాలరాజు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ సోహెల్ నటించిన లేటెస్ట్ మూవీ బూట్‌కట్ బాలరాజు.. శ్రీ కోనేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మేఘమాల హీరోయిన్‌గా నటించింది.. అలాగే ఈ మూవీలో సునీల్ మరియు ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైంది.బూట్ కట్ బాలరాజు మూవీని ఎన్నో అడ్డంకులను దాటుకొని మేకర్స్ థియేటర్లలోకి తీసుకొచ్చారు..బూట్‌కట్ బాలరాజు ప్రమోషన్స్, ప్రొడక్షన్ కోసం తన సొంత డబ్బులు కూడా కోసం ఉపయోగించినట్లు సోహెల్ తెలిపాడు.. థియేటర్లలో సినిమా చూడటానికి ప్రేక్షకులు రాకపోవడంతో అతడు ఎమోషనల్ అయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు.ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం..
బూట్‌కట్ బాలరాజుమూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తుంది..మార్చి 1 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానున్నట్లు సమాచారం..ఈ మూవీ కథ విషయానికి వస్తే ఊరి పెద్ద పటేలమ్మ (ఇంద్రజ ) కూతురు మహాలక్ష్మిని (మేఘమాల) బాలరాజు ప్రేమిస్తాడు. వారి ప్రేమకు పటేలమ్మ ఒప్పుకోదు. సర్పంచ్ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలిస్తేనే కూతురు మహాలక్ష్మిని నీకు ఇచ్చి పెళ్లిచేస్తానని బాలరాజుతో ఛాలెంజ్ చేస్తుంది పటేలమ్మ. ఆమె ఛాలెంజ్‌ను బాలరాజు అంగీకరించాడా..సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి మహాలక్ష్మి ప్రేమను సొంతం చేసుకున్నాడా..లేదా? అన్నదే బూట్ కట్ బాలరాజు మూవీ కథ. ఈ మూవీలో బిగ్‌బాస్ బ్యూటీ సిరిహనుమంతు ఓ కీలక పాత్రలో కనిపించింది.సినిమాలో సోహెల్ కామెడీ బాగున్నా కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది
Also Read
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
తాజావార్తలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!