Janasena: ఏపీలో రాజీనామాలు, జంపింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పార్టీలో సీటు దక్కలేదని మరో పార్టీ గూటికి చేరుకుంటున్నారు నేతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రోజురోజుకి సమీకరణాలు మారుతున్నాయి. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. రాజోలు జనసేన ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించిన బొంతు రాజేశ్వరరావు.. బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఫామ్ రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్‌కు ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యారు. అనంతరం కేడర్‌తో చర్చలు జరిపిన ఆయన జనసేనకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేనకు గుడ్ బై చెప్పి రేపు జగన్ సమక్షంలో కాకినాడలో సొంత గూటికి బొంతు రాజేశ్వరరావు చేరునున్నారు.
Read Also: Memantha Siddham Bus Yatra: 17వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..
అయితే, రాజోలు నియోజకవర్గానికి జనసేన పార్టీలో ఒక ప్రత్యేక అనుంబంధం ఉందని చెప్పవచ్చు.. రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో జనసేకు ఎదురుగాలి వీచినా.. రాజోలులో మాత్రం జనసేన జెండా ఎగిరింది.. రాజోలు నియోజకవర్గ ప్రజలు ఆ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్‌కి విజయాన్ని కట్టబెట్టారు.. కానీ.. ఆయన క్రమంగా జనసేనకు దూరమవుతూ.. వైసీపీకి చేరువయ్యారు.. దీంతో, జనసేన చేతి నుంచి ఆ ఒక్క సీటు కూడా చేజారిపోయినట్టు అయ్యింది.. కానీ, ఈ సారి రాజోలు స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు జనసేనాని పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో మరోసారి ఆ స్థానాన్ని దక్కించుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.. రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్లీ ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.