Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bondi Beach Shooter Mother Say Anyone Would Wish To Have A Son Like My Son

Sydney Terror Attack: నా కొడుకులాంటివాడు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది.. నిందితుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

Published Date :December 15, 2025 , 12:06 pm
By Suresh Maddala
  • సిడ్నీ బోండి బీచ్‌లో తండ్రి,కొడుకు మారణహోమం
  • నిందితుడిని వెనకేసుకొచ్చిన తల్లి
  • తన కొడుకు చాలా మంచివాడిగా సమర్థింపు
  • కాల్పుల్లో 15 మంది మృతి.. నిందితుడు హతం
Sydney Terror Attack: నా కొడుకులాంటివాడు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది.. నిందితుడి తల్లి సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో మారణహోమం సృష్టించిన నిందితులు తండ్రి, కొడుకులిద్దరూ పాకిస్థాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడు నవీద్ అక్రమ్ తల్లి వెరీనా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘నా కొడుకు లాంటి కొడుకు కావాలని ఎవరైనా కోరుకుంటారు.’’ అని వ్యాఖ్యానించింది. దాడికి కొన్ని గంటల ముందు కూడా తనతో మాట్లాడాడని.. తన కొడుకు అలా చేశాడంటే నమ్మలేకపోతున్నట్లు వాపోయింది. తన కొడుకు చాలా మంచివాడని వెనకేసుకొచ్చింది.

Sydney Terror Attack

తన కొడుకు ఉగ్రవాదంలో పాల్గొన్నాడంటే నమ్మలేకపోతున్నానని.. అసలు వాడి దగ్గర తుపాకీ లేదని వెరీనా చెప్పుకొచ్చింది. ఎక్కువగా బయటకు వెళ్లడని.. స్నేహితులు కూడా ఎవరూ లేరని పేర్కొంది. మద్యపానం.. ధూమపానం అలవాటే లేదని.. చెడు ప్రదేశాలకు కూడా వెళ్లడని తెలిపింది. పనికి వెళ్తాడు.. తిరిగి ఇంటికొస్తాడు.. జిమ్‌కు మాత్రం వెళ్తాడని చెప్పుకొచ్చింది. అంతే తప్ప ఇంకేమి చెడ్డ అలవాట్లు లేవని పేర్కొంది. చాలా మంచివాడని.. ఎవరైనా అలాంటి కొడుకు కావాలని ఏ తల్లైనా కోరుకుంటుందని వెరీనా తెలిపింది.

ఇది కూడా చదవండి: Lok sabha: కాంగ్రెస్ వ్యాఖ్యలపై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నిరసన

నిందితులు సాజిత్ అక్రమ్ (50), కొడుకు నవీద్ అక్రమ్ (24) చేపల వేటకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. కానీ వారు వెళ్లింది మనుషులను వేటాడేందుకు అని వెరీనా గుర్తించలేకపోయింది. నవీద్ అక్రమ్ చాలా రోజులుగా ఐసిస్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు కలిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఏ మాత్రం అనుమానం రాకుండా తండ్రి, కొడుకులిద్దరూ మసులుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

నివేదికల ప్రకారం.. నవీద్ అక్రమ్ గతంలో సిడ్నీలోని హెకెన్‌బర్గ్‌లోని అల్-మురాద్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖురాన్ అధ్యయనాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు 2024లో కొనుగోలు చేసిన మూడు బెడ్‌రూమ్‌ల ఇంట్లో తల్లిదండ్రులు, తమ్ముళ్లతో కలిసి నివసిస్తున్నాడు. నవీద్‌కు చేపలు పట్టడం, ఈత కొట్టడం, స్కూబా డైవింగ్, వ్యాయామం చేయడం అలవాట్లు ఉన్నాయి. వారాంతంలో చేపల వేట కోసం సిడ్నీకి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెర్విస్ బేకు వెళ్తున్నట్లు తండ్రీకొడుకులు బంధువులకు చెప్పినట్లుగా దర్యాప్తు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితుడి సహా 16 మంది మృతి. పలువురు గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Republic Day: ఈసారి రిపబ్లిక్ డేకు అతిథులుగా వచ్చేదెవరంటే..! భారత్ ఆహ్వానించింది వీళ్లనే!

The hero of Bondi Beach, is NOT a Muslim!

He’s a Maronite Christian ✝️
(A Christian sect of Middle Eastern believers in Jesus Christ)

He is From Lebanon. This his name is Arabic, Ahmed Al Ahmed, but he is a Christian.

Praise God for his courage. 🙏
pic.twitter.com/QLqRRLx5ml

— Doug Sides (@DougSides) December 15, 2025

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bondi beach shooter
  • mother
  • son
  • Sydney terror attack

తాజావార్తలు

  • Free AI Training: కెరీర్‌ కోసం ఏఐ కొత్త ప్రోగ్రామ్ ప్రారంభం.. వీడియో ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్ నేర్చుకోండి

  • Venkaiah Naidu: ‘యోగా ఫర్ మోడీ కాదు.. యోగా ఫర్ బాడీ’.. మాజీ ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..

  • Hyderabad: నగరాన్ని కుదిపేస్తున్న కల్తీ ప్రొడక్ట్స్.. రసాయనాలతో చిక్కీలు, నమ్కీన్ తయారీ

  • Fauji; ‘ఫౌజీ’ సినిమాపై జయప్రద క్లారిటీ!

  • RCB Fastest Chase IPL: కోహ్లీ క్లాస్.. పడిక్కల్ మాస్.. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ బిగ్గెస్ట్ రికార్డ్..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions