Bonda Umamaheswara Rao: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మధ్య మాటల యుద్ధం, సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. నేను కబ్జా, రౌడీయిజం చేసుంటే చూపించు అంటూ సవాల్ చేశారు. విజయవాడ సెంట్రల్ లో నాకు సీటు లేదు సరే.. వెల్లంపల్లికి సీటు ఉందా..? అని ప్రశ్నించారు. వెల్లంపల్లి కోఆర్డినేటర్ మాత్రమేనన్న బోండా.. నీ బీఫారం చూపించు వెల్లంపల్లి.. నా బీఫారం చూపిస్తాను అంటూ సవాల్ చేశారు. దీన్ని ఏమనాలి.. ఈ విధంగా 175 గెలుస్తారా..? అని ఎద్దేవా చేశారు. ఇక, సాక్ష్యాధారాలతో సహా ఎలక్షన్ కమిషనర్, మునిసిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.. ఎలక్షన్ కమిషనర్.. మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఒక దొంగని సెంట్రల్ లో పెట్టారు.. పశ్చిమ చెత్తను సెంట్రల్ లో ముద్ర వేసి వదిలేశారని ఫైర్ అయ్యారు.
Read Also: Shiva Balakrishna : ముగిసిన HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీ విచారణ
ఇక, వెల్లంపల్లి వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ కు కూడా ఇవన్నీ ఆధారాలతో సహా అందజేస్తాం అన్నారు బోండా ఉమ.. మున్సిపల్ కమిషనర్.. సీపీకి లెటర్ రాశారు.. అయినా స్పందన లేదన్నారు. తెలంగాణలో ఇలా చేస్తేనే ఒక డీజీపీ ఇంటికి వెళ్లిపోయాడు.. రూల్ ఆఫ్ లా తెలిసిన అధికారులు ఒత్తిడికి గురి కావద్దు అని హితవుపలికారు. నేను కబ్జా, రౌడీయిజం చేసుంటే చూపించు అంటూ వెల్లంపల్లికి సవాల్ విసిరారు.. వెల్లంపల్లి మీద ఆడపిల్లలని హెరేస్మెంట్ చేసిన కేసులున్నాయి.. ఎఫ్ఐఆర్ లతో సహా చూపిస్తాను అన్నారు. మరోవైపు, రాజకీయ ప్రచారాలలో వాలంటీర్లు పాల్గొనకూడదని సర్క్యులర్ ఉంది.. కానీ, వాలంటీర్లతో వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా సమావేశం అయ్యి కుక్కర్లు, తలొక పదివేలు ఇచ్చారని ఆరోపించారు.. అందులో సెంట్రల్ నియోజకవర్గ వాలంటీర్లను గుర్తించామని తెలిపారు టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.