తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోడానికి తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల పండగా సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. కాగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Read Also: Andrapradesh : ఏపీలో దారుణం.. టీచర్ ను అతి దారుణంగా చంపి..
హైదరాబాద్ పాతబస్తీలో నేడు, రేపు బోనాల పండగ జరుగనుంది. బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజాలో నేడు (ఆదివారం) ఉత్సవాలు, రేపు (సోమవారం) ఊరేగింపులు సజావుగా జరిగేలా పట్టిష్ట చర్యలు తీసుకున్నాట్ల సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసులు, స్థానిక పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఉన్నతాధికారులను నియమించారు.
Read Also: Narendra Modi : మోడీ కోసం యూఏఈ ప్రత్యేకంగా రూపొందించిన శాఖాహారం మెనూ..
ప్రజలకు అసౌకర్యం కలగకుండా నగరంలో ట్రాఫిక్ మళ్లింపులను ముందుగానే పోలీసులు ప్రకటించారు. ప్రజలందరూ ఉత్సవాలు సజావుగా జరిగేలా సహకరించాలని డీసీసీ సాయి చైతన్య కోరారు. పాతబస్తీలోని సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయం, ఇతర ఆలయాల్లో బోనాల పండుగ వేళ భారీగా భక్తులు తరలి వస్తుండటంతో పోలీసుల ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాజకీయ నాయకులు, సినీ నటులు, ఐఏఎస్, ఐసీఎస్ అధికారులతో సహా పలువురు వీఐపీలు ఇవాళ పాతబస్తీలోని లాల్ దర్వాజా ఆలయాన్ని సందర్శించి నైవేద్యాలు సమర్పించనున్నారు.
